ప్రజలని దోచుకునేదంతా ఆంధ్రా సినీ నిర్మాతలే .. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను దోచుకునేది అంతా ఆంధ్రా సినిమా నిర్మాత‌లే అని అన్నారు. ప్ర‌జ‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి చెప్పిన మాట‌నే తాను చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. సినిమా అనేది వ్యాపారం అని, వెయ్యి కోట్లు పెట్టి సినిమాలు చేసి మూడు వేల కోట్లు సంపాదించాల‌ని అనుకుంటార‌ని అన్నారు.

ప్రజలని దోచుకునేదంతా ఆంధ్రా సినీ నిర్మాతలే .. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జ‌ల‌ను దోచుకునేది అంతా ఆంధ్రా సినిమా నిర్మాత‌లే అని అన్నారు. ప్ర‌జ‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చి చెప్పిన మాట‌నే తాను చెబుతున్నాన‌ని వ్యాఖ్యానించారు. సినిమా అనేది వ్యాపారం అని, వెయ్యి కోట్లు పెట్టి సినిమాలు చేసి మూడు వేల కోట్లు సంపాదించాల‌ని అనుకుంటార‌ని అన్నారు. సినిమాలు ఫ్లాప్ అయ్యి రోడ్ల‌పైకి వ‌చ్చిన నిర్మాతలు కూడా ఉన్నార‌ని అన్నారు. సినిమా నిర్మాత‌ల్లో 99శాతం మంది ఆంధ్రా నుండే ఉన్నార‌ని చెప్పారు. వాళ్లే తెలంగాణ‌లో ఉండి ఇలాంటి ప‌నులు చేస్తున్నార‌ని అన్నారు. తెలంగాణ వాళ్లు అలాంటి ప‌నులు చేయ‌ర‌ని చెప్పారు.

టికెట్ ధ‌ర‌లు పెంచాలంటే సినీ కార్మికుల‌కు కూడా 20శాతం ఇవ్వాల‌ని సీఎం చెప్పిన మాట‌ను తాను స‌మ‌ర్దిస్తున్నాన‌ని చెప్పారు. ఒక క‌మిష‌న‌ర్ త‌న ప‌క్క‌న సినిమా వాళ్ల‌ను పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం నెగిటివ్‌గా వెళ్లింద‌ని ప్ర‌జ‌లు చెబుతున్నార‌ని తెలిపారు. అధికారులు ఏమైనా చేస్తే వారిని అన‌కుండా ప్ర‌భుత్వాన్ని అంటార‌ని చెప్పారు. కాబ‌ట్టి అధికారులు అలా చేయ‌వ‌ద్ద‌ని తెలిపారు. ఐబొమ్మ ర‌వి విష‌యాన్ని న్యాయ‌స్థానాలు చూసుకుంటాయ‌ని చెప్పారు. దొంగతనం చేయడం తప్పేనని కానీ ఎవరిదగ్గర దొంగతనం చేశాడు అనేది కూడా ముఖ్యమేనని అన్నారు. రాబిన్ హుడ్ పెద్దోళ్ల వద్ద దొంగలించి పేదలకు పంచిపెట్టారని అన్నారు. ప్ర‌జ‌లు రాబిన్ హుడ్ అంటున్నారు కాబట్టి తాను కూడా అంటున్నాన‌ని చెప్పారు.

Next Story