- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమ్మె విరమణకు జేఏసీ నేతలు ససేమిరా..! మూడు ప్రధాన డిమాండ్లపై పట్టు
ఆర్టీసీ జేఏసీ నేతలు, ఐఏఎస్ అధికారుల బృందం మధ్య సచివాలయంలో రెండు గంటలుగా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ (RTC) కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ (JAC) నాయకులు భేటీ అయ్యారు. ఇప్పటి వరకు సుమారు రెండు గంటలు గడుస్తున్నా.. చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని కీలక డిమాండ్లపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. చర్చల ఆరంభంలోనే జేఏసీ నాయకులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచినట్లుగా సమాచారం. వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల బృందానికి విన్నవించారు.
ఇక మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ (Shankar Goud) కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జేఏసీ నేతలు భేటీలో మరింత పట్టుబట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. మరోవైపు ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఐఏఎస్ (IAS) అధికారుల బృందం జేఏసీకి విజ్ఞప్తి చేసింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే అధికారికంగా ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అధికారుల విజ్ఞప్తిపై జేఏసీ నేతలు స్పందిస్తూ.. కేవలం హామీలతో సరిపెట్టబోమని, తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామని స్పష్టం చేసినట్లుగా సమాచారం.






