మేళ్లచెరువు జాతరకు వేళాయె..

by Disha Web Desk 4 |
మేళ్లచెరువు జాతరకు వేళాయె..
X

దిశ నేరేడుచర్ల /మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి జాతరకు ముస్తాబైంది. 18 నుంచి ఐదు రోజుల పాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది.

మేళ్లచెరువు జాతర అంటే ఎడ్ల పందాలకు పెట్టింది పేరు‌‌‌‌‌‌‌. ఎడ్ల పందాలు, బండ లాగుడు పోటీలకు తెలంగాణ, ఏపీ నుంచి లక్షలాది మంది తరలివస్తారు. భారీ లైటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రభలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. బందోబస్తు కోసం 450 మందిని కేటాయించడంతో పాటు, సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా జాతర ప్రదేశాన్ని నిత్యం పరిశీలించనున్నాయి. అలాగే ఆర్టీసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి అరగంటకు మేళ్లచెరువుకు ఆర్టీసీ బస్సు నడపనున్నారు.

పాంచానక దీక్షతో బ్రహ్మోత్సవాలు

మేళ్లచెరువు శివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు ఐదు రోజులపాటు ఉత్సవాల నిర్వహిస్తుంటారు. అంకురార్పణతో మొదలై అభిషేకాలు మహాన్యాసకపూర్వ రుద్రాభిషేకం‌తో కుంకుమార్చనలు రథోత్సవం నిత్య పూజలతో చివరి రోజు పూర్ణాహుతి పవళింపు సేవ కార్యక్రమాలతో ఉత్సవాలు ముగుస్తాయి .

5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం..

ఈ దేవాలయం పురాతన దేవాలయం కావడం.. ఇక్కడ 5 రోజుల పాటు నిర్వహించే ఎద్దుల పందాలు విద్యుత్ అలంకరణతో ఏర్పాట్లను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున హాజరు కానున్నట్లు కమిటీ నిర్వహకులు తెలిపారు. సుమారు 5 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేసి దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు .

ఆకర్షణగా నిలవనున్న ఎడ్ల పందాలు

మేళ్లచెరువు జాతర అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది ఎడ్ల పందాలు. ఇక్కడ పందాలకు ప్రత్యేక సంతరించుకుంది. తెలంగాణ ఆంధ్ర ,కర్ణాటక రాష్ట్రాల నుండి 8 విభాగాలలో 200 జతల ఎడ్లు పోటీలలో పాల్గొన్ననున్నాయి. ఎద్దుల పందెల కోసం ప్రత్యేకంగా కోర్టును ఏర్పాటు చేసి దానిలో బండలను ఏర్పాటు చేశారు. ఎద్దుల బల ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లను ఆలయ కమిటీ నిర్వహకులు చేస్తున్నారు. ఈ పందెలలో గెలుపొందిన ఎడ్ల జతల వారికి రూ. 70 లక్షల విలువ చేసే బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు .

విద్యుత్ కాంతులతో..

భక్తులను ఎక్కువగా ఆకర్షించేది ప్రభల ఊరేగింపు..ఈ శివాలయానికి ప్రత్యేక ఆకర్షణ శివరాత్రి రోజు రాత్రి సుమారుగా 10 విద్యుత్ ప్రభలు 50 అడుగుల ఎత్తైన ప్రభలపై ఆకర్షణమైన లైటింగ్ ఏర్పాటు చేసి వాటిపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తారు. జాతర ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది.

400 మంది సిబ్బందితో బారీ బందోబస్తు..

ఈ జాతరకు మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెసీలు, కార్పొరేషన్ చైర్మెన్లు వివిధ హోదాలో ఉన్న ప్రజా ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ముఖ్య నాయకులు వివిధ శాఖల అదికారులు పాల్గొంటుననున్నారు. దీంతో శాంతిభద్రతలు, ట్రాఫిక్ దృష్టిని ఉంచుకొని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో ఇద్దరు డీఎస్‌పీ ఆధ్వర్యంలో 11 సీఐలు 40 మంది ఎస్‌ఐలు 400 మంది సిబ్బందితో బారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు . 30 సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 7రూట్లలో వాహనాలకు పార్కింగ్ స్థలాలను గుర్తించి చదును చేసి ఉంచామని మేళ్లచెరువు ఎస్సై సురేష్ తెలిపారు .

పారిశుధ్యం దృష్టిలో ఉంచుకొని 200 మంది పారిశుధ్య కార్మికులతో పనులను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే 60 టెంపరరి టాయ్‌లెట్లను 15 చోట్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటిని మైహోమ్ సిమెంట్ పరిశ్రమ అందిస్తున్నట్లు మేళ్లచెరువు పంచాయతీ ఈఓ నారాయణ రెడ్డి తెలిపారు. అత్యవసర వైద్య సేవలకోసం 2 మెడికల్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి 108ను అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

24 గంటలు సేవలు అందించే విధంగా 3 షిఫ్టులలో 16 మంది వైద్య సిబ్బందితో మెడికల్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యాధికారి ప్రేమ్ సింగ్ తెలిపారు. జాతరను చూసేందుకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, జగ్గయ్యపేట ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జాతరకు వచ్చే భక్తులకు 5 రోజులు ఎమ్మెల్యే సైది రెడ్డి, ఓజో పౌండేషన్ చైర్మెన్ పిల్లుట్ల రఘు, ఎన్ఆర్ఐ జైపాల్ రెడ్డి‌లు వేరువేరుగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

హాజరుకానున్న మంత్రులు,ఎంపీలు

18న ఎండ్ల పందేల ప్రారంభోత్సవనికి జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొననున్నారు. అలాగే ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జాదీపిక యుగేందర్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు జాతరకు రానున్నారు. 22న రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖులు హాజరుకానున్నారు.

Next Story

Most Viewed