IT Raids: దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. పలు కీలక పత్రాలు స్వాధీనం

by Shiva |
IT Raids: దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. పలు కీలక పత్రాలు స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు ఇవాళ ముగిశాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి మూడు రోజుల పాటు ఆయన ఇళ్లు, కార్యాలయాలు, సోదరుడు, కుమార్తెతో పాటు వ్యాపారుల భాగస్వాముల ఇళ్లో సోదాలు కొనసాగాయి. అదేవిధంగా మైత్రీ మూవీ మేకర్స్‌ (Mythri Movie Makers) నిర్మాతలు, మ్యాంగో మీడియా (Mango Media), పుష్ప దర్శకుడు సుకుమార్‌ (Sukumar), అనిల్ రావిపూడి (Anil Ravipudi) నివాసాల్లో కూడా సోదాలు చేశారు. గురువారం సోదాల్లో భాగంగా మొత్తం 21 మంది పాల్గొన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, ప్రముఖ ఫైనాస్సర్లు సత్య రంగయ్య (Satya Rangaiah), నెక్కింటి శ్రీధర్‌ (Nekkanti Sridhar), నెల్లూరు ప్రతాప్‌ రెడ్డి (Nellore Prathap Reddy) ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సంక్రాంతి (Sankranti)కి విడుదలైన భారీ బడ్జెట్‌ సినిమాలే టార్గెట్‌గా ఈ సోదాలు నిర్వహించారు. దీంతో పాటు పుష్ప-2 (Pushpa-2) మూవీ కలెక్షన్స్ వ్యవహారంపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భారీగా నిధుల గోల్‌మాల్‌ అయినట్లు అధికారులు గుర్తించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

Advertisement

Next Story