- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IT Raids: ఐటీ అధికారుల దూకుడు.. పుష్ప-2 నిర్మాతల ఇళ్లలో కొనసాగుతోన్న సోదాలు
నగరంలో ఐటీ అధికారులు పంజా విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో ఐటీ అధికారులు పంజా విసిరారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి మొత్తం 55 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ (Hyderabad) పరిధిలో పలుచోట్ల విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా, పుష్ప-2 (Pushpa-2) మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) సంస్థలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఆ సంస్థ అధినేత నవీన్ (Naveen), సీఈవో చెర్రీ (CEO Cherry) నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన ‘పుష్ప-2’ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. సౌతిండియా, నార్త్ ఇండియా అనే తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. వరల్డ్ వైడ్‌గా పుష్ప-2 మూవీ రూ.1,732 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. అదేవిధంగా ఇటీవలే నిర్మాత దిల్ రాజు (Dil Raju) భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer), ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankrantiki Vasthunnam) మూవీలను నిర్మించారు. ఆ రెండు మూవీలు కూడా సంక్రాంతి పండుగకు విడుదలై భారీ ఎత్తున కలెక్షన్లు రాబట్టాయి. అయితే, ప్రస్తుతం పండగ సందర్భంగా విడుదలైన మూవీలను నిర్మించిన సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






