- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదు.. మంత్రి కొండా సురేఖ
శాఖా పరంగా తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేసేందుకు మినిస్టర్లు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హీటు పుట్టిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: శాఖా పరంగా తమ వద్దకు వచ్చే ఫైళ్లను క్లియర్ చేసేందుకు మినిస్టర్లు డబ్బు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో హీటు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియా (Social Media)లోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ క్లారిటీ ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించడం సరి కాదని ఆక్షేపించారు. గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలోని మంత్రులు ప్రతి చిన్న పనికి కూడా డబ్బు తీసుకునే వారని అన్నారు. వాళ్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలను పట్టుకుని తమ మంత్రులను అన్నట్లుగా సోషల్ మీడియాలో కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కొండా సురేఖ ఫైర్ అయ్యారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
వరంగల్‌లోని కృష్ణ కాలనీలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సీఎస్ఆర్ (CSR) నిధులతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ (Aurobindo Pharma Foundation) నిర్మించిన నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలికలకు ఉన్నత విద్యను అందిస్తున్న తరగతి గదులు వర్షాకాలంలో జలమయం అవుతుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాత భవనాన్ని కూల్చి అదే స్థలంలో కొత్త బిల్డింగ్ కట్టాలని కలెక్టర్ కూడా తన దృష్టికి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అందుకు రూ.4.5 కోట్లు అవుతుందని చెప్పారని.. ఆ డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలో తెలియలేదన్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కాబట్టి.. పలు కంపెనీల ఫైళ్లు క్లియరెన్స్ కోసం తన వద్దకు వస్తాయని అన్నారు. అలాంటప్పుడు మంత్రులు ఎంతో అంత డబ్బు తీసుకుని క్లియర్ చేస్తారని, అలా తనకు నయా పైసా అక్కర్లేదని, కొత్త కాలేజీ బిల్డింగ్ నిర్మాణానికి సహకరించాలని అరబిందో ఫార్మా ఫౌండేషన్ ప్రతినిధులను కోరగా.. వారు రూ.4.5 కోట్లతో నిర్మాణం పూర్తి చేశారని కొండా సురేఖ తెలిపారు.






