- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తే అమలు చేసే బాధ్యత నాది : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను తీసివేస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.

- ముస్లింకు 10 శాతం రిజర్వేషన్లు తొలగించి, బీసీలపై ప్రభుత్వం ఆలోచించాలి
- మత పరమైన సమస్యలు తీసుకొచ్చి దేశంలో అశాంతికి కాంగ్రెస్కుట్రలు
- రాష్ట్రపతిపై తెలంగాణ మహిళా మంత్రి వ్యాఖ్యలు అభ్యంతరకరం
దిశ, తెలంగాణ బ్యూరో : మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లను తీసివేస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటానని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొలగిస్తే, తాను స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలతో మాట్లాడతానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లతో ముస్లింలను ఎలా ముడిపెడతారని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరాలోచించుకోవాలని సూచించారు. అసదుద్దీన్ ఒవైసీ, అజారుద్దీన్, షబ్బీర్ అలీ వంటి వారు బీసీలు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు 420 సబ్ గ్యారంటీలతో ఆశచూపి అధికారంలోకి వచ్చిందన్నారు. ఆ తర్వాత ఏ ఒక్క హామీని అమలు చేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో, పాలనలో వైఫల్యంతో, చేతకానితనంతో, అప్పులు తీర్చేందుకు అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అథ:పాతాళానికి తొక్కేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఇచ్చిన హామీలకు రేవంత్ తోపాటుగా రాహుల్ గాంధీ, సోనియాగాంధీ పూర్తి బాధ్యత వహించాలన్నారు. బీసీలకు ఇచ్చిన 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో న్యాయబద్ధంగా చర్చించి ఇచ్చే ప్రయత్నం చేయాలన్నారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా మార్చి హోల్ సేల్ అవినీతి చేస్తే, కాంగ్రెస్ పార్టీ రిటెయిల్ గా అవినీతికి పాల్పడుతోంది. అవినీతిలో అగ్రస్థానం, అప్పుల్లో అగ్రస్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మతపరమైన రిజర్వేషన్లను పెట్టిందుకు కాంగ్రెస్కుట్రలు
దేశంలో అశాంతిని సృష్టించేందుకు కాంగ్రెస్ప్రయత్నం చేస్తుందని, బీసీ సామాజిక వర్గానికి మోసం చేయడమే ఆపార్టీ పెద్దలుగా అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ చెప్పినట్లే నాటకాలు చేస్తాయని వారు చెప్పినట్లే అసెంబ్లీలో వ్యవహరించడంతో పాటు పాలన అదే విధంగా చేస్తారని దుయ్యపట్టారు. జనగణన తూతూ మంత్రంగా నిర్వహించారని, హైదరాబాద్ నగరంలో 25 శాతం మంది ఇళ్లలోకి వెళ్లకుండా దాన్ని గొప్ప సర్వేగా చెప్పుకోవడం సిగ్గుచేటు దీన్ని బీసీ సమాజం అర్థం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి స్థానంలో ఉన్న మహిళపై తెలంగాణలోని ఓ మహిళా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మంత్రి వ్యాఖ్యలపై సోనియా గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాజకీయ వేదికలపై ఇలా దిగజారి.. రాజకీయంగా సంబంధం లేని రాష్ట్రపతి గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇది ముమ్మాటికీ దేశంలోని మహిళలకు అవమానకరం అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా బీసీలకు పెద్దపీట వేసి వారికి వెన్నంటి ఉండే ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.






