- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీళ్లను గుర్తు పట్టగలరా..? ఇది MLA చోరీ కాదా.. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి స్పందించారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ఉద్దేశించి కేటీఆర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. (Congress) కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినప్పటి ఫొటోలను షేర్ చేసి ప్రశ్నించారు. ‘ప్రియమైన రాహుల్‌గాంధీ, ఫొటోల్లోని కాంగ్రెస్ కండువాలను గుర్తు పట్టగలరా? ఢిల్లీలో మీతో కలిసిన ఈ ఫిరాయించిన BRS ఎమ్మెల్యేలను మీరు గుర్తించగలరా? ఇప్పుడు BRS టికెట్‌పై గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఈ ఎమ్మెల్యేలు అందరూ తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని చెబుతున్నారు. ఇది మీరు అంగీకరిస్తున్నారా? ఇది MLAల చోరీ కాదా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేంటి..? అంటూ కేటీఆర్ రాహుల్ గాంధీని నిలదీశారు. కాగా, ఓటు చోరీ గురించి రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు కంటే.. ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని ట్విట్టర్‌లో రాహుల్‌కు కేటీఆర్ ట్యాగ్ చేశారు. ట్వీట్ లింక్..






