మీరు ఆడపిల్లలకు ఇచ్చే గౌరవం ఇదేనా..కేటీఆర్‌కు మహిళ సూటి ప్రశ్న

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-26 16:09:50  IST  )

కేటీఆర్ అన్నా మీ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఓ మహిళ వీడియోను విడుదల చేసింది.

మీరు ఆడపిల్లలకు ఇచ్చే గౌరవం ఇదేనా..కేటీఆర్‌కు మహిళ సూటి ప్రశ్న
X

దిశ, వెబ్ డెస్క్: కేటీఆర్ అన్నా మీ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఓ మహిళ వీడియోను విడుదల చేసింది. జర్నలిస్ట్ శంకర్ అనే యూట్యూబర్ తనను మోసం చేశాడని అలాంటి వ్యక్తికి బెయిల్ ఎలా ఇప్పించారని ఆవేదన వ్యక్తం చేసింది. తన జీవితాన్ని శంకర్ మోసం చేశాడని, అతనికి ఎలా బెయిల్ ఇప్పించారని కన్నీళ్లు పెట్టుకుంది. బీఆర్ఎస్‌లో ఆడపిల్లలకు చాలా మర్యాద ఇస్తామంటారు..ఇదేనా మీ మర్యాద అని ప్రశ్నించింది. శంకర్ తనను మోసం చేశాడని చాలా సార్లు సోషల్ మీడియా ద్వారా మిమ్మల్ని ట్యాగ్ చేసి చెప్పినా చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

తననే మోసం చేసి డబ్బుల కోసం తాను ఇలాంటి కేసులు పెట్టానని బెయిల్ పేపర్లలో పేర్కొన్నారని చెప్పింది. తాను తప్పుడు కేసులు పెట్టానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం అని చెప్పింది. కావాలంటే తనను నడీరోడ్డుపై ఉరితీయాలంటూ బోరున విలపించింది. ఇదిలాా ఉంటే శంకర్ తనను నమ్మించి మోసం చేశాడని శారీరకంగా, మానసికంగా వేధించాడని గతంలో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అతడు బెయిల్ పై బయటకు రాగా బీఆర్ఎస్ నేతలే అతనికి సాయం చేశారని బాధితురాలు ఆరోపిస్తుంది. వీడియో

Next Story