- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది కదా అసలైన మార్పంటే..? మాజీ మంత్రి హరీశ్ రావు సెటైరికల్ ట్వీట్
తుమ్మడిహట్టి (Thummadihatti) నుంచి ఎల్లంపల్లి (Yellampally)కి నీటిని తరలించేందకు రేవంత్ సర్కార్ పూనుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: తుమ్మడిహట్టి (Thummidihatti) నుంచి ఎల్లంపల్లి (Yellampally)కి నీటిని తరలించేందకు రేవంత్ సర్కార్ పూనుకుంది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలు సవరిస్తూ కొత్త ప్రీ ఫీజబిలిటీ రిపోర్టు (PFR) సిద్ధమవుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన 1, 2, 3, 4, 5, 23, 24, 25, 26 ప్యాకేజీల పనులను మళ్లీ పునరుద్ధరించడానికి ప్రీ ఫీజబిలిటీ నివేదికను సిద్ధం చేయాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) అధికారులను ఆదేశించారు. పెరిగిన ధరల ప్రకారం ఈ 9 ప్యాకేజీల పనుల అంచనాలను సవరిస్తే, ప్రాజెక్టు వ్యయం ఐదారు రెట్లు పెరిగి రూ.35 వేల కోట్లకు చేరింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయంపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా సెటైరికల్ ట్వీట్ చేశారు. మేడిగడ్డ నుంచి మల్లన్న సాగర్‌కు నీటి తరలింపునకు మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.84,000 కోట్లు ఖర్చకు అయిందని అన్నారు. కానీ, కేవలం తుమ్మడిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి రూ.35 వేల కోట్లు ఖర్చ చేస్తోందని అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాళేశ్వరం (Kaleshwaram) పథకంతో 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలనేది లక్ష్యం అయితే, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుతో కేవలం 4.47 లక్షల ఎకరాలకే సాగు నీరదిస్తారనట అంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరంలో నీటి వినియోగం 240 టీఎంసీ అయితే, ప్రాణహిత చేవెళ్లలో 80 టీఎంసీలేనని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే మూడో వంతు ఖర్చు చేస్తూ, పదోవంతు ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వరా? అని ప్రశ్నించారు. రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి కేవలం 4.47 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలనే ఆలోచన అద్భుతం.. అమోఘం అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఇంజనీరింగ్ నైపుణ్యానికి మరో నిదర్శనం.. ఇది కదా అసలైన మార్పంటే? అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.






