Revanth Reddy vs KCR: రేవంత్ రెడ్డి ప్లాన్ కు కేసీఆర్ కౌంటర్ ప్లాన్.. బీఆర్ఎస్ నిరసన వెనుక మతలబు ఇదేనా?

by Prasad Jukanti |

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు కీలక మలుపు తిప్పబోతున్నాయా?

Revanth Reddy vs KCR: రేవంత్ రెడ్డి ప్లాన్ కు కేసీఆర్ కౌంటర్ ప్లాన్..  బీఆర్ఎస్ నిరసన వెనుక మతలబు ఇదేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో రెడీ అయ్యాయి. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చిడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ సర్కార్ ఈ సెషన్ నిర్వహిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు జరుగుతున్న సెషన్ కావడంతో ఎవరు ఎలాంటి పాచికలు వేయబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

కాళేశ్వం వర్సెస్ యూరియా:

ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన 'కాళేశ్వరం నివేదిక' (Kaleshwaram) విషయంలో బీఆర్ఎస్ ను చిక్కుల్లో పెట్టబోతున్నదని తెలుస్తోంది. అయితే దీనికి కౌంటర్ గా గులాబీ పార్టీ నయా స్కెచ్ తో రెడీ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న యూరియా (Uriya) కొరతను తమ కౌంటర్ ప్లాన్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద బీఆర్ఎస్ సభ్యులు యూరియా కొరతపై వినూతన్న నిరసనకు దిగారు. అమరవీరుల స్థూపం వద్ద ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు. 'గణపతి బప్పా మోరియా – కావాలయ్యా యూరియా' అంటూ నినాదాలు చేయడం ఇంట్రెస్టింగ్ గా మారింది. యూరియా సమస్య నేరుగా గ్రామాల్లోని రైతులతో ముడిపడిన సమస్య కావడం చేత ఈ ఇష్యూను ఎత్తుకోవడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచవచ్చనేది బీఆర్ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. కాళేశ్వరంపై కౌంటర్ ఇచ్చుకుంటూనే యూరియా ఇష్యూను టార్గెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్ చుట్టూ రేవంత్ వ్యూహం:

అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఓ ఎత్తు అయితే ఈ సెషన్ కైనా కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఉత్కంఠగా మారింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యం సభలో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ బాస్ ఇప్పటికే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేటీఆర్, హరీశ్ రావు, పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. దీంతో కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేసీఆర్ గైర్హాజరు అయితే ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు అధికారపక్షం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్.. కాళేశ్వరం విషయంలో చర్చ నిర్వహిస్తే సభకు హాజరు కాకుండా పలాయనం చిత్తగించారని అధికార పక్షం టార్గెట్ చేసే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేక సందర్భాల్లో చర్చకోసం సభకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదే పదే కోరారు. కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీ వైపు కూడా చూడటం లేదు. అసలే లోకల్ బాడీ ఎలక్షన్ సీజన్ కావడంతో ఈసారి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరింత రేంజ్ లో డోస్ పెంచి ప్రజల్లోకి బీఆర్ఎస్ వైఫల్యాన్ని తీసుకువెళ్లాలనే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ సైతం వరదల విషయంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసేందుకు రేడీ అయింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఎలాంటి డైలాగ్ వార్ లు ఉండబోతున్నాయో చూడాలి.

Next Story