- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా.. ఎంపీ రఘునందన్ రావు ఫైర్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) ఓటరు కార్డులను పంపిణీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ (Naveen Yadav) ఓటరు కార్డులను పంపిణీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఆయన ఈసీ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదైంది.
తాజాగా, ఇదే అంశంపై తాజాగా బీజేపీ ముఖ్య నేత, ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ (Congress) నుంచి టికెట్ కోసం పోటీ పడుతున్న ఓ అభ్యర్థి ఓటర్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రొగ్రాం పేరుతో కార్యక్రమం నిర్వహించడం హాస్యాస్పదమని అన్నారు. చేసిందే తప్పు అంటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అఫీషియల్ పేజీల్లో ఫొటోలు పెట్టారని తెలిపారు. దేశంలో ఓటరు కార్డుల పంపిణీ చేసే అధికారం ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులకు మాత్రమే ఉంటుందని అన్నారు. ఇలా నేతలే ఓటరు కార్డులు పంచి పెడుతుంటే రాష్ట్రంలో ప్రజస్వామ్యం ఎక్కడి పోతుందని ప్రశ్నించారు. దేశంమంతా ‘ఓట్ చోరీ’ అంటూ పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో ఓటరు కార్డుల చోరీ ఎందుకు అవుతుందో సమాధానం చెప్పాలి. అసలు ఈసీ పరిధిలో ఉండాల్సిన ఓటరు కార్డులు కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వచ్చాయో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని రఘునందర్ రావు డిమాండ్ చేశారు.






