చేతిలో రాజ్యాంగం రాజకీయ లబ్ధి కోసమేనా? రాహుల్‌‌గాంధీని నిలదీసిన హరీశ్ రావు

by Ramesh Naini |

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ దుమారం రేపుతోంది.

చేతిలో రాజ్యాంగం రాజకీయ లబ్ధి కోసమేనా? రాహుల్‌‌గాంధీని నిలదీసిన హరీశ్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Ra) స్పందించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై (Rahul Gandhi) రాహుల్ గాంధీని హరీష్ రావు నిలదీశారు. గురువారం ఎక్స్ ఖాతా ద్వారా హారీశ్ రావు ట్వీట్ స్తూ.. చేతిలో రాజ్యాంగం పట్టుకునేది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా రాహుల్ గాంధీ? అని ప్రశ్నించారు. మీ తండ్రి రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఫిరాయింపు వ్యతిరేక చట్టం ప్రకారం నడుచుకోమని తెలంగాణ స్పీకర్‌కు ఆదేశాలు ఇస్తావా ? అని నిలదీశారు. నువ్వు చేతిలో పట్టుకొని తిరిగే రాజ్యాంగ విలువలు పాటిస్తావా? అని ఆయన రాహుల్ గాంధీకి ట్వీట్ గ్యాగ్ చేశారు.

కాగా, రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. అనర్హత వేటుపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కోర్టు కొట్టివేసింది. అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయస్థానమే అనర్హత వేటు వయాలన్న విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్.. అన్న సూత్రం వర్తించుకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.

Next Story