Boreddy : మరీ ఇంత క్షుద్ర, దిగజారుడు రాజకీయమా? : బోరెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-27 09:54:40  IST  )

బీఆర్ఎస్(BRS)పాలనా కాలంలో జరిగిన ప్రమాదాల్లో అప్పటి సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(KTR) లు ఘటన స్థలాలకు వెళ్లనటువంటి విషయాలను విస్మరించి..మీరు మంత్రిగా చేసిన పాపాలకు నేడు మా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులపై నిందలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై సీఎం చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy)మండిపడ్డారు

Boreddy : మరీ ఇంత క్షుద్ర, దిగజారుడు రాజకీయమా? : బోరెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS)పాలనా కాలంలో జరిగిన ప్రమాదాల్లో అప్పటి సీఎం కేసీఆర్(KCR), మంత్రి కేటీఆర్(KTR) లు ఘటన స్థలాలకు వెళ్లనటువంటి విషయాలను విస్మరించి..మీరు మంత్రిగా చేసిన పాపాలకు నేడు మా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులపై నిందలు వేస్తారా అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)పై సీఎం చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy)మండిపడ్డారు. ఎస్ఎల్బీసీ (SLBC) ప్రమాదానికి కారణం సొరంగం పనులను మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఆపేయడమే అని మీ అంతరాత్మ ఘోషిస్తలేదా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

అధికారం పోగానే అన్నీ మర్చి పోతారని హరీష్ రావు అనుకుంటే ఎలా అని నిలదీశారు. కొండగట్టు దగ్గర ప్రమాదంలో ప్రాణాలు పొతే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు పోలేదో అని ఎందుకు అడుగలేదని బోరెడ్డి కేటీఆర్ ను ప్రశ్నించారు. అంతెందుకు ప్రాతినిధ్యం వహించే(స్వంతంకాకపోయినా) నియోజకవర్గం మాసాయిపేటలో చిన్నారులు, పసికూనలు ప్రాణాలు కోల్పోతే బాధ్యతారాహిత్యాన్ని ఎందుకుప్రశ్నించలేదన్నారు. శ్రీశైలం విధ్యుత్ ప్లాంటు ప్రమాదం, కాళేశ్వరం, కొండపోచమ్మ సాగర్.... అంతెందుకు జీహెచ్ఎంసీ వరదలలో పడవల్లో తిరగాల్సిన దుస్థితిలో అప్పటి మీ మంత్రి కేటీఆర్ ఏమయ్యారో అని అడిగే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.

టన్నెల్ లో కూరుకుపోయిన వారి ప్రాణాలు కాపాడాలనే తపనతో మంత్రులు ఉత్తమ్, జూపల్లి, వెంకట్ రెడ్డిలు, అధికారులు, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన 9 బృందాలు శ్రమిస్తుంటే కనిపిస్తలేదా అని గుర్తు చేశారు. ఆపత్కాలాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉండటమే కదా ప్రతిపక్ష నాయకునికి ఉండాల్సిన లక్షణమని..ఫామ్ హౌజ్ లో పడుకునే నాయకుడి సారధ్యంలో పనిచేస్తూ మాపై నిందలు ఎందుకంటూ బోరెడ్డి ఎద్దేవా చేశారు.

Next Story