- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా?
ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో అన్నంలో గాజుముక్కలు వచ్చాయంటూ ఆదివారం రోడ్డుపై బైఠాయించి విద్యార్థినులు ధర్నా చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో అన్నంలో గాజుముక్కలు వచ్చాయంటూ ఆదివారం రోడ్డుపై బైఠాయించి విద్యార్థినులు ధర్నా చేశారు. గత రెండు వారాలుగా సరైనా భోజనం లేదని...మెస్ బిల్లులు కట్టినా లిమిటెడ్ ఫుడ్ పెడుతున్నారని ఆరోపించారు. ఈ ధర్నాలో ఓ విద్యార్థిని సీఎం కేసీఆర్, వీసీలను నిలదీసిన వీడియోను మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ట్విట్టర్లో షేర్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ ఈ అమ్మాయిని చూసి నేర్చుకోవాలన్నారు. ఈ విధంగా ప్రశ్నించే గుణం ఉండాలి శభాష్ తల్లి! అంటూ విద్యార్థిని అభినందించారు. అందరూ ఈ అమ్మాయిలా ప్రశ్నిస్తే కేసీఆర్ భయపడడా ? అని అన్నారు. ' ఎక్కడ చూసినా ఇవే కథలు. పిల్లల తిండి మీద పడ్డారేంటో వెదవలు. ఎక్కడ చూసినా ఇవ్వే కథలు..సిగ్గులేని పరిపాలన. తెలంగాణ మోడల్ అంట ! దేశం మొత్తానికి ఆదర్శం అంట. పెద్ద జోక్ ' అంటూ మురళి మండిపడ్డారు






