- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాడు మనోడేనా..? ప్రసంగంలో కేసీఆర్ మార్క్ డైలాగులు
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో కొందరు బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. సభాస్థలి ముందే జై కేసీఆర్ అంటూ అరవడం మొదలు పెట్టారు. దీంతో కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలపై ఫైర్ అయ్యారు. తాను మాట్లాడేది అందరికీ అర్థం కావాలని, మీ నినాదాలు బంద్ పెట్టాలని ఆగ్రహించారు. అయినా బీఆర్ఎస్ వాదులు నినాదాలు ఆపకపోవడంతో రజతోత్సవ సభా వేధికగా కేసీఆర్ మాస్ డైలాగులు మరోసారి వినిపించాయి. ఈ సందర్భంగా కేసీఆర్.. "అరె మళ్లేం సిగం పెట్టిర్రా బయ్.. యాడికెళ్లి మోపయిర్రయా మీరు.. బుద్ది లేదా ఆగు.. ఏమయ్యా నువ్వు రుబాబ్ చేస్తున్నవ్ ఆగు.. వద్దంటే మళ్లేందయా.. ఎవరయ్యా రాజేశ్వర్ రెడ్డి వాళ్లు?.. వాడు మనోడేనా..! అంటూ తన మార్క్ డైలాగులు వదిలారు. దీంతో సభ మరోసారి హోరెత్తిపోయింది. కేసీఆర్ డైలాగులు విన్న పార్టీ నేతలు నవ్వులు పూయించారు. అనంతరం కేసీఆర్ కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతూ.. ప్రసంగాన్ని కొనసాగించారు.






