అంతా మీ ఇష్టమేనా..? మద్యం టెండర్ల గడువు పొడిగింపుపై హైకోర్టు ఫైర్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే.

అంతా మీ ఇష్టమేనా..? మద్యం టెండర్ల గడువు పొడిగింపుపై హైకోర్టు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మద్యం దుకాణాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్రంలో బీసీ బంద్‌, బ్యాంకుల బంద్‌లతో దరఖాస్తు చేసుకోలేకపోయామన్న ఫిర్యాదులతో ఎక్సైజ్‌ శాఖ మద్యం షాపుల దరఖాస్తుల గడవును ఈనెల 23 వరకు పొడిగించింది. అయితే, దరఖాస్తును గడువు పెంచడం చట్ట విరుద్ధమంటూ పలువురు మద్యం వ్యాపారులు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు వారి పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి ఎన్ తుకారంజీ (Justice N Tukaranji) విచారణ చేపట్టారు. వాదనల సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు మద్యం దరఖాస్తుల గడువు పెంపునకు చట్టబద్ధత ఉందా.. అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఇలా ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని కామెంట్ చేశారు. చట్ట విరుద్ధంగా గడువు పెంచితే దరఖాస్తులు రద్దు చేయాల్సి ఉంటుందని జస్టిస్ తుకారం‌జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరపు న్యాయవాది విజ్ఞప్తి మేరకు కేసులో తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేశారు. మరోవైపు మద్యం దుకాణాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించకపోవడంపై దాఖలైన పిటిషన్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Next Story