- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తడం టెర్రరిజమా..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ వైఫల్యాలపై గొంతెత్తడం టెర్రరిజమా?, మా పార్టీ సోషల్ మీడియా మీద చట్ట వ్యతిరేక వేధింపులు ఆపాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BRS Leader RS Praveen Kumar) అన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టుల (BRS Social Media Activists) మీద జరుగుతున్న పోలీసు విచారణపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆర్ఎస్పీ (RSP).. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)పై హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ 420 వాగ్ధానాల మీద, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రశ్నిస్తున్న గొంతుకల మీద రేవంత్ సర్కార్ (Revanth Government) తీవ్ర నిర్బంధాన్ని ఉపయోగిస్తున్నదని తెలిపారు.
ఇటీవల అక్రమ కేసులు నమోదు అయిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిశాంక్ (BRS Leader Krishank) ను విచారణలో భాగంగా మొబైల్ ఫోన్ కావాలని అడగడం, మరో ఆక్టివిస్టు నల్లబాలు (Nallabalu)ని అయితే మరీ ఘోరంగా బ్యాంక్ స్టేట్మెంట్లు, UPI వివరాలు, అప్పుల వివరాలు, క్రెడిట్, డెబిట్ కార్డు స్టేట్‌మెంట్లు, డిష్ టివీ రీచార్జి వివరాలు, వైఫై, మొబైల్ బిల్ పేమెంట్ వివరాలు అడగడం ఆశ్చర్యకరమని అన్నారు. ఇవన్నీ మనీ లాండరింగ్ లాంటి వ్యవస్థీకృత నేరాలు(organised crime) పరిశోధనలో అడుగుతారని, ప్రజల పక్షాన నిలబడే సోషల్ మీడియా ఆక్టివిస్టుల మీద కాదు అని మండిపడ్డారు.
ఈ ప్రశ్నావళిని మీ మంత్రుల పేషీలు, గాంధీ భవన్ లో మీ నాయకులకు ముందు పంపించండి.. ప్రజలకు చాలా మేలు జరుగుతుందని సూచించారు. ముసోలినీ-హిట్లర్ల పాలనలో కూడా అన్యాయానికి వ్యతిరేకంగా గళమెత్తిన పౌరులను ఇన్ని ప్రశ్నలు అడగి ఉండరు! అంటూ.. వెంటనే బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద ఈ చట్టవ్యతిరేక వేధింపులు ఆపాలని తెలంగాణ డీజీపీ (Telangana DGP)కి ఆర్ఎస్ ప్రవీణ్ విజ్ఞప్తి చేశారు.