- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran-Israel war: శంషాబాద్‌లో 10 విమానాలు రద్దు.. పశ్చిమాసియాలో మూతపడిన గగనతలం
యుద్ధం భీకర రూపం దాల్చడంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ ఎయిర్ పోర్టులను ఇప్పటికే మూసివేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఖతార్, బెహ్రయిన్, కువైట్, యూఏఈ దేశాలు కూడా తమ గగనతలాన్ని (Airspace) క్లోజ్ చేశాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదరడంతో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్) నుంచి వెళ్లాల్సిన 10 విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురై, నిరాశతో వెనుదిరుగుతున్నారు.
అంతర్జాతీయ గగనతలం మూసివేత..
యుద్ధం భీకర రూపం దాల్చడంతో ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు తమ ఎయిర్ పోర్టులను ఇప్పటికే మూసివేశాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ఖతార్, బెహ్రయిన్, కువైట్, యూఏఈ దేశాలు కూడా తమ గగనతలాన్ని (Airspace) దాదాపు క్లోజ్ చేశాయి. ఖతార్ రాజధాని దోహా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మిస్సైల్ దాడులకు దిగడంతో అక్కడ భారీ పేలుళ్లు సంభవించినట్లు ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. పశ్చిమాసియాలో నెలకొన్న అస్థిరత కారణంగా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. లుఫ్తాన్సా మార్చి 7 వరకు ఇజ్రాయెల్ (టెల్ అవీవ్), లెబనాన్ (బీరుట్), ఒమన్‌లకు సర్వీసులను రద్దు చేసింది. శని, ఆదివారాల్లో దుబాయ్ విమానాలను కూడా నిలిపివేసింది. విజ్ ఎయిర్ సంస్థ ఇజ్రాయెల్, దుబాయ్, అబుదాబి, ఒమన్‌లకు వెళ్లే విమానాలను మార్చి 7 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఎయిర్ ఇండియా
ఎయిర్ ఇండియా సంస్థ ఢిల్లీ నుంచి టెల్ అవీవ్ వెళ్లాల్సిన AI 139 విమానాన్ని ఇజ్రాయెల్ గగనతలం మూసివేయడంతో మధ్యలోనే వెనక్కి మళ్లించి, ముంబైలో ల్యాండ్ చేశారు. KLM డచ్ క్యారియర్ సంస్థ ఆమ్‌స్టర్‌డామ్ నుంచి టెల్ అవీవ్ సర్వీసులను రద్దు చేసింది.
ప్రయాణికులకు విజ్ఞప్తి..
యుద్ధం కారణంగా విమాన మార్గాలను దారి మళ్లించడం లేదా రద్దు చేయడం జరుగుతోందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ప్రయాణికులు విమానాశ్రయానికి వచ్చే ముందే సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్లు లేదా హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా తమ ఫ్లైట్ స్టేటస్‌ను సరిచూసుకోవాలని సూచించారు.






