భారత్‍ను నరకంతో పోల్చిన ట్రంప్‍.. HYD ఇరాన్ ఎంబసీ కౌంటర్

by Prasad Jukanti |

భారత్‌ను నరకంతో పోల్చిన డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

భారత్‍ను నరకంతో పోల్చిన ట్రంప్‍.. HYD ఇరాన్ ఎంబసీ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తన చర్యలతో స్వదేశంతో పాటు విదేశాలలో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‍పై అక్కసు వెల్లగక్కాడు. తాజాగా ఆయన భారత్‍ను నరకంతో పోల్చాడు. భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖెల్ సవేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్టు చేయడం తీవ్ర దుమారం రేగింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ట్రంప్ కు ఇరాన్ కౌంటర్ ఇచ్చింది. ట్రంప్ చేసిన పోస్టుపై హైదరాబాద్ లోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ వేదికగా స్పందించింది. భారత్, చైనా నాగరికతకు పుట్టినిల్లు. నిజానికి నరకం అనేది అక్కడే ఉంది అక్కడి యుద్ధ నేరస్థుడైన అధ్యక్షుడు (ట్రంప్) ఇరాన్‌లోని నాగరికతను పూర్తిగా నాశనం చేస్తానని బెదిరిస్తున్నాడు అని కౌంటర్ ఇచ్చింది. విభజించి పాలించు (Divide and rule) రూల్ ఉంటుంది. కానీ ట్రంప్ పాలన ఏమీ లేకపోయినా కేవలం విభజన చేస్తున్నాడని ధ్వజమెత్తింది.

Next Story