ACB DG : ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ

by Ramesh Naini |

పండుగ పూట రేవంత్ సర్కార్ పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు.

ACB DG : ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పండుగ పూట రేవంత్ సర్కార్ పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏసీబీకి డైరెక్టర్ జనరల్‌గా ఉన్న సీవీ అనంద్ సమక్షంలో విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. గతంలోనూ సీవీ ఆనంద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశారు.

కాగా, ప్రస్తుతం సిటీ సీపీగా పని చేస్తున్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేశారు. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్‌ను నియమించారు. లాండ్ అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా ఉన్న మహేష్ భగవత్‌కు పోలీస్ పర్సనల్ అండ్ వెల్ఫేర్ అడిషనల్ డీజీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం. రమేష్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story