- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. విచారణ టీమ్‍లో ఉన్న ఏఎస్ఐ కాల్చుకుని సూసైడ్
పూరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ మరో పోలీస్ ఆత్మహత్యకు పాల్పడటం హర్యానాలో కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కులవివక్ష కారణంగా ఆత్మహత్య చేసుకున్న హర్యానా (Haryana) ఐపీఎస్ వై.పూరణ్ కుమార్ (IPS Puran Kumar) ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పూరణ్ కుమార్ ఆత్మహత్య కేసు విచారణ చేస్తున్న టీమ్‍లో ఉన్న ఏఎస్ఐ సందీప్ కుమార్ ఇవాళ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సూసైడ్ లెటర్‍తో పాటు ఓ వీడియోను సైతం రికార్డు చేశాడు. ప్రస్తుతం రోహ్‍తక్ సైబర్ సెల్‍లో పని చేస్తున్న ఐఎస్ఐ సందీప్ కుమార్ (Sandeep Kumar suicide), ఐఏఎస్ పూరణ్ కుమార్‍పై సంచలన ఆరోణలు చేశారు. పూరణ్ కుమార్ జాతి వివక్షతో సిస్టమ్ హైజాక్ చేశారని, రోహ్‍తక్ రెంజ్‍లో నియమితులయ్యాక పురణ్ కుమార్ నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించుకోవడం మొదలు పెట్టారని ఆరోపించారు. వీరంతా ఫైళ్లను బ్లాక్ చేసి పిటిషనర్లకు ఫోన్ చేసి మానసికంగా హింసించారని డబ్బు అడిగారని ఆరోపించారు. బదిలీల కోసం మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా దోపిడీ చేశారని ఆరోపించారు. పూరణ్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని తనపై వచ్చిన ఫిర్యాదుకు భయపడి అతను ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ ఆరోపించారు. కాగా హర్యానా పోలీస్ శాఖలో అధికారుల వరసు ఆత్మహత్యలు సంచలనంగా మారాయి.






