- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
లిక్కర్ కేసులో ఈడీ చార్జీ షీట్ పై విచారణ
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ పై శనివారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. 13,657 వేల పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షెట్ దాఖలు చేశామని ఈడీ కోర్టుకు తెలిపింది. మొదటి ఛార్జ్ షీట్ లో ఏ1 సమీర్ మహేంద్ర, ఏ2, ఏ3, ఏ4, ఏ5 లుగా సమీర్ మహేంద్ర కంపెనీల పేర్లు ఉన్నాయి. చార్జిషీట్ లో ఆరుగురు వ్యక్తులు, 11 కంపెనీలను చేర్చిన ఈడీ.. సప్లిమెంటరీ చార్జీషీట్ లో ఐదుగురితో పాటు ఏడు కంపెనీలను చేర్చింది. ఈడీ చార్జీ షీట్ లో సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా పేర్లు ఉన్నాయి. మరో వైపు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. శరత్ చంద్రారెడ్డి బెయిల్ విచారణను కోర్టు జనవరి 20కి వాయిదా వేసింది. మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి బినయ్ బాబు జ్యూడిషీయల్ ఇవాళ్టితో ముగియనుంది.