ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ట్విస్ట్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-14 09:23:38  IST  )

తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో ట్విస్ట్.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) ఇవాళ సుప్రీం కోర్టు (Supreme Court)లో జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఈ మేరకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు (Prabhakar Rao) సిట్ విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌తో పాటు ఇంటిరిమ్ ప్రొటెక్షన్‌ను రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలోనే ఇరు పక్షాల వాదనలు పూర్తిగా విన్న ధర్మాననం సంచలన ఆదేశాలు జారీ చేసింది. కేసులో సిట్‌ అధికారులు అడిగిన సమాచారం ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావు ఇవ్వాల్సిందేనని ఆదేశించింది. ఈ కేసులో క్లౌడ్‌, యాపిల్‌ క్లౌడ్‌ సమాచారం విచారణ అధికారులకు ఇవ్వాల్సిందేనని కామెంట్ చేసింది. అదేవిధంగా యూజర్‌, పాస్‌వర్డ్‌ల సమాచారం ఇవ్వాలని జస్టిస్‌ నాగరత్న ధర్మాసనం ఆదేశించింది. ఫోరెన్సిక్‌ నిపుణుల సమక్షంలో సమాచారం తీసుకోవాలని సిట్‌కు సూచించింది. సమాచారం నాశనం చేసినట్లుగా నిందితుడు ప్రయత్నించనట్లుగా తేలితే తదుపరి చర్యలపై తాము నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Next Story