- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అధికార పార్టీ ఎమ్మెల్యేకు నోటీసులు
by Gantepaka Srikanth |
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు. జూన్ 1వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థుల, ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ అంశంపై మొదటగా డీజీపీకి ఫిర్యాదు చేసిన వారిలో యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముందున్నారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేశారు. తదనంతరం మరికొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా తమ ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా కేసు వేగం పుంజుకుంది. ప్రస్తుతం విచారణ వేగవంతం కాగా, జూన్ 1న యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధికారుల ముందు హాజరై తన వాంగ్మూలాన్ని ఇవ్వనున్నారు.
Next Story






