- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Thieves In Nalgonda : నల్గొండలో పట్టపగలే రెచ్చిపోయిన అంతరాష్ట్ర దొంగలు
నల్గొండ(Nalgonda)జిల్లా కేంద్రంలో పట్టపగలే అంతరాష్ట్ర దొంగ(Interstate Thieves)లు విహారం చేశారు. జిల్లా ఎస్సీ ఆఫీస్ కు కూత వేటు దూరంలో వరుస చైన్ స్నాచింగ్(Chain Snatching) పాల్పడి సంచలనం రేపారు.

దిశ, వెబ్ డెస్క్ : నల్గొండ(Nalgonda)జిల్లా కేంద్రంలో పట్టపగలే అంతరాష్ట్ర దొంగ(Interstate Thieves)లు విహారం చేశారు. జిల్లా ఎస్సీ ఆఫీస్ కు కూత వేటు దూరంలో వరుస చైన్ స్నాచింగ్(Chain Snatching) పాల్పడి సంచలనం రేపారు. పక్కనే గడియారం సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన కేటీఆర్ మహాధర్నా కొనసాగుతున్న క్రమంలో ధర్నాకు వెళుతున్న కార్యకర్తల ముసుగులో దొంగల ముఠా రెచ్చిపోయింది.
రోడ్డు పక్కన నిలబడి ఉన్న అరుగురి మహిళల మెడలో బంగారు గొలుసులు, పలువురి సెల్ ఫోన్ లు లాక్కొని దొంగలు పారిపోయారు. నల్గొండ టు టౌన్ పరిధిలోని ఎన్జీ కళాశాల, క్లాక్ టవర్ సెంటర్ వద్ద జరిగినర వరుస చైన్ స్నాచింగ్ లు, సెల్ ఫోన్ చోరీలతో బాధితులు లబోదిబోమన్నారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దొంగల ఆచూకీ కోసం రంగంలోకి దిగగా..మహారాష్ట్రకు చెందిన ఒకరిని టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పారి పోయిన దొంగల ముఠా కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మరోవైపు తమ బంగారం గొలుసు చోరీ చేశారని, సెల్ ఫోన్లు చోరీ చేశారంటు బాధితులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు క్యూ కడుతున్నట్లుగా సమాచారం.






