- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా అరెస్టు
సైబరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేసారు.

దిశ, వెబ్ డెస్క్ : సైబరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠా గుట్టు రట్టు చేసారు. గుజరాత్ నుంచి పసి పిల్లలను అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక బృందాలు గుజరాత్‌కు చెందిన ఏజెంట్లతో సంప్రదింపులు జరుపుతూ ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని గుర్తించగా, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి పసి పిల్లలను రక్షించి సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ముఠాకు మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో గుజరాత్ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు. చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 100 లేదా 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






