- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy : ఎల్బీ స్టేడియంలో రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో రేపు ఉదయం 6:00 గంటల నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా "వన్ డే కౌంట్‌డౌన్ యోగా" కార్యక్రమం జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad)లోని ఎల్బీ స్టేడియం(LB Stadium)లో రేపు ఉదయం 6:00 గంటల నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా "వన్ డే కౌంట్‌డౌన్ యోగా" కార్యక్రమం జరగనుంది. కాగా ఈ ఏర్పాట్లను కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి(Kishan Reddy) పరిశీలించారు. ఈ ఈవెంట్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma), మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు తేజ సజ్జా వంటి ప్రముఖులు పాల్గొంటారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని, ముఖ్యంగా ఉపాధ్యాయులు యోగా అంబాసిడర్లుగా మారాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా, "Yoga for One Earth, One Health" థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరిన కిషన్ రెడ్డి.. ఈ ఈవెంట్ యోగా వలన ఆరోగ్య ప్రయోజనాలను, భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే లక్ష్యంతో జరుగుతుందని తెలిపారు. కాగా ఈ కార్యక్రమం దృష్ట్యా రేపు ఉదయం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు.






