- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం.. తొలిరోజు 95.72 శాతం హాజరు
by Kema Shiva Kumar |
రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముగిశాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు 1,41,548 ఉండగా, 6,325 మంది గైర్హాజరు కాగా, మొత్తం 95.72 శాతం హజరు నమోదైనట్లుగా పేర్కొన్నారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు బోర్డు ప్రత్యేక పరిశీలకులను నియమించింది. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, సంగారెడ్డి, మెదక్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జనగామ, హన్మకొండ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలను వారు సందర్శించారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయని, పరీక్షలు సజావుగా సాగాయని పరిశీలకులు బోర్డుకు తెలిపారు.
Next Story






