అలాంటి ఫ్రెండ్స్‌ను అస్సలు వదులుకోకండి.. తెలంగాణ పోలీసుల సూచన

by Gantepaka Srikanth |

ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలను ఫ్రెండ్స్‌తో మాట్లాడుతాం.

అలాంటి ఫ్రెండ్స్‌ను అస్సలు వదులుకోకండి.. తెలంగాణ పోలీసుల సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోలేని ఎన్నో విషయాలను ఫ్రెండ్స్‌తో మాట్లాడుతాం. ఇలా మనందరికీ జీవితంలో వివిధ దశల్లో ఫ్రెండ్స్‌ ఉంటారు. వారిలో కొందరు కొంతకాలానికే మనతో పయనిస్తే.. మరికొందరు జీవితాంతం మన కష్టసుఖాల్లో తోడుగా, ఉన్నత స్థానాలకు చేరేలా ప్రోత్సహిస్తూ ఎప్పుడూ వెన్నంటి నిలుస్తారు. ముఖ్యంగా కష్ట సమయాల్లో భరోసాను ఇచ్చే స్నేహితులను అస్సలు వదులుకోవద్దు అని తెలంగాణ పోలీసులు(Telangana Police) సూచించారు. స్నేహితుల దినోత్సవం(Friendship Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘స్నేహమంటే ఆపదలో నేనున్నానంటూ ముందుకు వచ్చే భరోసా. అవగాహన కల్పించే నేస్తం. అలాంటి స్నేహితుల్ని అస్సలు వదులుకోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తెలంగాణ పోలీస్‌ అండగా ఉంటారు. మీకు నిజమైన స్నేహితులుగా నిలుస్తారు’ అని పేర్కొన్నారు.

Next Story