స్వార్థంతో మొత్తం స్వరూపాన్నే మార్చేయడం సరికాదు.. MLC విజయశాంతి ఆసక్తికర ట్వీట్

by Gantepaka Srikanth |

ప్రపంచ ధరిత్రి దినోత్సవం(World Earth Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర పోస్టు పెట్టారు.

స్వార్థంతో మొత్తం స్వరూపాన్నే మార్చేయడం సరికాదు.. MLC విజయశాంతి ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ధరిత్రి దినోత్సవం(World Earth Day) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ(Congress MLC) విజయశాంతి(Vijayashanti) ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘‘అనంతమైన ఈ విశ్వంలో మనిషికి ఆవాసయోగ్యమైన ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఇక్కడ ప్రకృతి ప్రసాదించిన వనరుల్ని సరిగా వినియోగించుకుంటేనే.. మనిషి మనుగడ సాఫీగా సాగుతుంది. ఆ వనరుల్లో దేన్ని దుర్వినియోగం చేసినా.. సమస్త మానవాళి జీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఈ విషయం తెలిసినప్పటికీ.. మనిషి తన పద్ధతి మార్చుకోవడం లేదు. అభివృద్ధి పేరిట విచ్చలవిడిగా అడవుల్ని నిర్మూలించుకుంటూ పోతున్నాడు. పరిశ్రమల పేరుతో.. గాలి, నీటిని కాలుష్యంలో ముంచెత్తుతున్నాడు. సహజ వనరుల్ని అవసరానికి మించి వినియోగిస్తున్నాడు. తన స్వార్థంతో మొత్తం ప్రకృతి స్వరూపాన్నే మార్చేస్తున్నాడు. ఇంత చేస్తుంటే.. ప్రకృతి ఊరుకుంటుందా..? భూకంపాలు, సునామీలు, వరదలు, కరువులతో హెచ్చరికలు చేస్తూనే ఉంది. కొన్ని సార్లు.. వైరస్‌ల రూపంలోనూ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో భూమి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేస్తోంది.. ఇకనైనా మారుదాం.. ప్రకృతి వనరుల్ని కాపాడుకుందాం. అందరికీ ప్రపంచ ధరిత్రి దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ విజయశాంతి ట్వీట్ పెట్టారు.

పంట భూములనూ, పర్యావరణాన్నీ పరిరక్షించుకోవడం పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరముంది. ఇందుకోసం తరచూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. విద్యాసంస్థలు, కూడళ్ల దగ్గర ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రసార మాధ్యమాల ద్వారా సామాన్యులకు అవగాహన కల్పించాలని ఆమె ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Next Story