- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్, భట్టిపై ఆశలు పెట్టుకున్నాం.. ఏం చేస్తారో చూడాలి : ఆకునూరి మురళి ఆసక్తికర ట్వీట్
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన ఇటీవల ఢిల్లీలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హాజరయ్యారు. కలిసి పనిచేద్దామని, వ్యవసాయం, విద్య, ప్రజారోగ్యం అత్యంత కీలక ప్రాధాన్యత అంశాలు అని భేటీలో ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ భేటీపై సోమవారం రిటైర్డ్ ఐఏఎస్, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali) తన ఎక్స్ ఖాతా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. విద్య కీలక ప్రాధాన్య అంశం అని ప్రధాన మంత్రి చెప్పారని తెలిపారు. అబద్ధాలు ఆడడం, మోసపూరిత మాటలు మాట్లాడడం ప్రజలను వంచించడం రాజకీయ నాయకులు అలవాటు చేసుకున్నారని విమర్శించారు.
2024-25, 2025-26 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ లో బీజేపీ ప్రభుత్వం విద్యకు కేటాయింపులు 2.5 % అని, గత 20 ఏళ్లలో కనిష్టం అని పేర్కొన్నారు. కానీ ప్రధాని మాటలు చూడండి.. మన కేసీఆర్ అయితే ప్లాన్ ప్రకారం విద్యను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఆయన చివరి ఏడాదిలో విద్య కు కేటాయించిన బడ్జెట్ 6.4 శాతం, 20 ఏళ్లలో అతి తక్కువ కేటాయింపులు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై ఆశలు పెట్టుకున్నామని వెల్లడించారు. ఏం చేస్తారో చూడాలి.. ప్రస్తుతానికి అయితే బీజేపీ, బీఆర్ఎస్ వలన ప్రభుత్వ బడుల్లో విద్య కొన ఊపిరి తో ఉందన్నారు. కాంగ్రెస్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ( 10 % విద్యార్థులకు మాత్రమే ఉపయోగపడే గురుకులాల విద్య పూర్తి పరిష్కారం కాదు) అని ఆకునూరి మురళి ట్వీట్‌లో పేర్కొన్నారు.






