- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇది బీఆర్ఎస్ విజయం’.. హరీష్ రావు ఆసక్తికర ట్వీట్
కల్వకుర్తి(Kalvakurthi Project) మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కల్వకుర్తి(Kalvakurthi Project) మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడంపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘ఎట్టకేలకు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయడం బీఆర్ఎస్ విజయం.. కేసీఆర్ విజయం. బీఆర్ఎస్ నిలదీస్తే గాని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)లో కదలిక రాలేదు. మేము ప్రశ్నిస్తే తప్ప రైతుల నీటి సమస్యలు గుర్తు రాలేదు. రైతుల నోరు కొడుతున్నడు, కడుపు కొడుతున్నడు రేవంత్ రెడ్డి అంటే గాని ఆలోచన రాలేదు. లక్షలాదిగా రైతులతో తరలి వచ్చి మోటార్లు ఆన్ చేస్తామంటే గాని చలనం రాలేదు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరదను ఒడిసిపట్టాల్సింది పోయి, విడిచిపెట్టడం దుర్మార్గం. ఇకనైనా రాజకీయకక్ష సాధింపు చర్యలపై దృష్టి పెట్టడం మానేసి రైతాంగంపై దృష్టి సారించండి. కల్వకుర్తి వలే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి, రిజర్వాయర్లు నింపి పొలాలకు నీళ్లు మళ్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’ అని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.






