- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్‌తో రాహుల్, సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం
ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌తో సహా అనేకమంది ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సరదాగా నవ్వుతూ సంభాషించారు. ఈ సందర్భంగా నేతల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమావేశానికి ముందు చోటుచేసుకున్న ఈ సరదా క్షణాలు కాంగ్రెస్ నేతల మధ్య ఐక్యతకు నిదర్శనంగా నిలిచాయని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఢిల్లీ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారని మండిపడ్డారు. కేబినెట్‌లో పెట్టకుండా.. దీనిపై కనీసం చర్చ చేయకుండా పేరు మార్చారని సీరియస్ అయ్యారు.
Read More..
CM Revanth: సీడబ్ల్యూసీ మీటింగ్.. ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలు పోస్ట్






