CM Revanth: సీడబ్ల్యూసీ మీటింగ్‌.. ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలు పోస్ట్

by Ramesh Naini |   (  Updated:2025-12-27 13:49:29  IST  )

ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

CM Revanth: సీడబ్ల్యూసీ మీటింగ్‌.. ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వివరాలు పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్‌లో కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌తో సహా అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక వివరాలు వెల్లడించారు. జనవరి 5 నుండి దేశవ్యాప్తంగా ‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ బచావో ఉద్యమం ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సారథ్యంలో జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం ఈ మేరకు తీర్మానించిందని స్పష్టం చేశారు.

పేదవాడి ఆకలి తీర్చి, ప్రతి పౌరుడి ఉపాధికి హామీ ఇచ్చి, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన చేకూర్చే బహుళ ప్రయోజనాలతో నాటి యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని’ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. మహాత్ముడి పేరుతో తీసుకువచ్చిన ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవాలని CWC తీర్మానించిందని వెల్లడించారు. దీని కోసం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు CWC సమావేశం ఫోటోలు షేర్ చేశారు.

Read More..

సీఎం రేవంత్‌తో రాహుల్, సోనియా గాంధీ.. సీడబ్ల్యూసీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం

Next Story