Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తొడగొట్టిన ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య మాటల యుద్ధం జరగడం కామన్. ప్రజా సమస్యలపై చర్చిస్తూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటారు.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తొడగొట్టిన ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య మాటల యుద్ధం జరగడం కామన్. ప్రజా సమస్యలపై చర్చిస్తూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటారు. ఈ క్రమంలోనే కొందరు కోపాన్ని లేదా సంతోషాన్ని ఆపుకోలేక వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ.రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని పడగొడుతామని పదే పదే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని.. దమ్ముంటే కూల్చేయండి అంటూ తొడగొట్టి మరీ రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా తమ ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అంతకుముందు హరీష్ రావు, కోమటిరెడ్డి మధ్య సైతం మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలు సైతం చేసుకున్నారు.

Next Story