Eatala Rajender: సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు

by Prasad Jukanti |
Eatala Rajender: సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: లంబాడి కమ్యూనిటి (Lambadi Community) సంస్కృతి, చరిత్ర భవిష్యత్తు తరాలకు అందించేందుకు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (MP Eatala Rajender) అన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ (Sant Sewalal) 286వ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజా బొల్లారం తండాలో ఇవాళ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడిన ఈటల.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పుట్టి దేశంలో ఉన్న 12 కోట్ల మంది బంజారా జాతికి ఆరాధ్యుడయ్యాడు. ఈ జాతికి నడవడిని అందించి దిక్సూచిగా నిలిచారని కొనియాడారు. ఇవాళ్టికి కూడా గూడుకు, ఉపాధికి దూరమై కష్టనష్టాలు అనుభవిస్తున్న జాతి లంబాడా జాతి అన్నారు. ఆనాడు పరాయి పాలనకు వ్యతిరేకంగా భూమాతను కాపాడడం కోసం, స్వేచ్ఛ కోసం జరిగిన పోరాటంలో లంబాడి జాతి సాహసవంతమైన పాత్ర పోషించిందన్నారు.

వీరంతా భూమిని, కష్టాన్ని, ధర్మాన్ని నమ్ముకున్నవారు, ఈ బాధలన్నీ బయటపడే రోజు త్వరలోనే వస్తుందని చెప్పారు. మోడీ ప్రధాని అయ్యాక మన గౌరవం కాపాడేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో స్పూర్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ఆదివాసీ గిరిజన మహిళను దేశ రాష్ట్రపతిని చేశారని గుర్తు చేశారు. అణగారిన జాతులు, వర్గాలు, అణిచివేతకు గురయ్యే వారిపట్ల నరేంద్ర మోడీ (Narendra Modi) కమిట్మెంట్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మీరు గెలిపించుకున్న బిడ్డగా మీ ఊరు వాడిగా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పిలిస్తే పలుకుతానని భరోసా ఇచ్చారు. బోజ్యానాయక్ అమరత్వంతో ఏర్పడ్డ తెలంగాణలో మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా దేశవ్యాప్తంగా జరపాలని ఇటీవలే కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశామని కలిసి సేవాలాల్ మహారాజు జయంతిని అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ జాతి గొప్పతనం గురించి, జాతి సమస్యల గురించి మోడీకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా అధికారికంగా జరుపుతారని ఆశిస్తున్నామమన్నారు. జాతి ఔన్నత్యం కోసం, సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా మందు వరుసలో ఉంటామన్నారు.

Advertisement
Next Story