- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దుబ్బాక మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన.. లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం
దుబ్బాక మున్సిపాలిటీ 3వ వార్డులో ఉత్కంఠ పోరు.. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావడంతో అధికారులు రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. ఫలితం మారకపోవడంతో చివరకు లక్కీ డ్రా తీశారు.

దిశ, వెబ్‌డెస్క్: సిద్దిపేట (Siddipet) జిల్లా దుబ్బాక (Dabbaka) మున్సిపాలిటీలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల పోరులో చివరికి విజేతను అదృష్టం వరించింది. 3వ వార్డులో బీజేపీ, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా (Tie) ఓట్లు రావడంతో అధికారులు అశ్చర్యపోయారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో ఎన్నికల అధికారులు రెండుసార్లు రీ-కౌంటింగ్ నిర్వహించారు. అయితే, రెండోసారి లెక్కించినా ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు.
లక్కీ డ్రా తీసిన అధికారులు..
అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం.. ఓట్లు సమానంగా వచ్చిన నేపథ్యంలో విజేతను లక్కీ డ్రా (Lucky Draw) ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించారు. అనంతరం అధికారులు చిన్న స్లిప్పులపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు రాసి ఓ బాక్సులో వేసి డ్రా తీయగా బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో అధికారులు ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు.






