- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Dasarath: గణపతి దేవుడి లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం.. ఆరేళ్లుగా వేలంలో ట్రై చేస్తున్నా
అందరూ ఊహించిన విధంగానే హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ(Balapur Laddu) కొత్త రికార్డు సృష్టించింది.

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఊహించిన విధంగానే హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ లడ్డూ(Balapur Laddu) కొత్త రికార్డు సృష్టించింది. వేలంలో రూ.35 లక్షలు పలికింది. లింగాల దశరథ్ గౌడ్(Lingala Dasharath Goud) అనే స్థానిక వ్యక్తి వేలం పాటలో లడ్డూ దక్కించుకున్నాడు. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడారు. బాలాపూర్ గణేష్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం. 2019 నుంచి బాలాపూర్ వేలానికి వస్తున్నా.. గత ఆరు ఏళ్లుగా గణేష్ లడ్డూ కోసం వేలంలో ప్రయత్నిస్తున్నా.. చివరకు ఇప్పుడు భగవంతుడు దయదలిచాడు.. చాలా సంతోషంగా ఉంది అని వేలంలో లడ్డూ దక్కించుకున్న లింగాల దశరథ్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అనంతరం లడ్డూ విజేత దశరథగౌడ్‌ను ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సన్మానించింది. గతేడాది రూ.30.01 లక్షలకు కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్న విషయం తెలిసిందే. గతేడాదికంటే ఈసారి లడ్డూ ధర రూ.4.99 లక్షలు అధికంగా పలికింది. ఈసారి వేలంలో 38 మంది భక్తులు పాల్గొన్నారు.






