Venkaiah Naidu: జొమాటో.. టమాటో అనకుండా వంట చేసుకోండి .. వంటిల్లుపై వెంకయ్యనాయుడు కామెంట్స్ వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-09-23 09:14:11  IST  )

వంట విడిపోతే జంట విడిపోతదని వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Venkaiah Naidu:  జొమాటో.. టమాటో అనకుండా వంట చేసుకోండి .. వంటిల్లుపై వెంకయ్యనాయుడు కామెంట్స్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: చతుర్లు, కవితాత్మక పదప్రయోగాలతో అందరినీ ఆకట్టుకునే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) వంటిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంట విడిపోతే జంట విడిపోతుందని అందువల్ల అందరూ వంటిల్లును (Kitchen Room) కాపాడుకోవాలని సూచించారు. నిన్న 'విజయవాడ ఉత్సవ్' (Vijayawada Utsav) కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. 'జొమాటో(Zomato).. టమాటో అని కాకుండా వంటింటిని కాపాడుకోండి. వంట చేయడం మానుకుని చాలా మంది ఆన్‍లైన్ లో పిజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకుంటున్నారు. వంటిల్లు పోతే జంట విడిపోతుంది. దయచేసి వంటింటిని కాపాడుకోవాలి. వంట మగవాళ్లు చేస్తారా? ఆడవాళ్లు చేస్తారా? అది వేరే విషయం. మగవాళ్లు కూడా వంట చేసిన చరిత్ర ఉంది. నలభీమ పాకం మించిన పాకం మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి' అన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా అనేక కుటుంబాల్లో వంటిల్లు పాత్ర తగ్గిపోయి ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లు పెరుగుతున్న తరుణంలో వెంకయ్యనాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story