- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాకు మంత్రి పదవి కంటే వాళ్లే ముఖ్యం’.. MLA కోమటిరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు
మంత్రి పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పదవిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎల్బీనగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి(Minister Post) ఇస్తామన్నారు అని గుర్తుచేశారు. కానీ తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. మునుగోడు ప్రజలే ముఖ్యమని ఇక్కడి నుంచే పోటీ చేశానని అన్నారు. 2018 ఎన్నికల్లో అందరూ ఓడిపోతే తాను గెలిచాను అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నన్ను ఓడించింది బీఆర్ఎస్(BRS) కాదని.. కమ్యూనిస్టులు ఓడించారని అన్నారు. కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు మద్దతు తెలపడం వల్లే నేను ఓడిపోయా అని రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు.
కాగా, ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి రాబోయే పదేండ్లూ నేనే ముఖ్యమంత్రిని అంటూ ప్రకటించుకోవడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పబట్టడం హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌లో అలా ప్రకటించుకోవడం పార్టీ విధానాలకు వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరని ఎక్స్ వేదికగా వెల్లడించారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పలువురు కాంగ్రెస్ నేతలు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఇది మరువకముందే మరోసారి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.






