BRS: హ‌రీశ్‌రావు 108 అంబులెన్స్ లాంటి వారు.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

BRS: హ‌రీశ్‌రావు 108 అంబులెన్స్ లాంటి వారు.. బీఆర్ఎస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (MLC Kavitha) బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె సస్పెన్షన్‌ తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చానీయంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు కవిత సస్పెండ్ అవ్వడాన్ని సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ (Devi Prasad) ఈ వ్యవహారంపై స్పందించారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ గీత దాటుతుందని కవితను కేసీఆర్ స్పెండ్ చేశారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తున్నారని, ఈ రెండు పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే బీఆర్ఎస్‌లో చిచ్చు పెడుతున్నాయని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరగిందని ఏజెన్సీలే తేల్చలేకపోయాయని అన్నారు. అలాంటిది అక్రమాలు జరిగాయని కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా? అని ప్రశ్నించారు. హరీశ్‌రావు కేసీఆర్ సైనికుడు, శ్రామికుడని కొనియాడారు. హరీశ్‌రావు ఎలాంటి వారో అందరికీ తెలుసన్నారు. కొందరు బురద జల్లినంత మాత్రాన ఆయన ప్రతిష్ట చెరిగిపోదన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని దేవీ ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Next Story