మాయమవుతున్న కేసీఆర్ మార్క్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరుపై ఉత్కంఠ?

by Gantepaka Srikanth |

ఈ నెల 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌కు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.

మాయమవుతున్న కేసీఆర్ మార్క్.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు హాజరుపై ఉత్కంఠ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 9న నిర్వహించనున్న తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌కు మాజీ సీఎం కేసీఆర్ వస్తారా? లేదా? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ప్రోగ్రామ్‌కు అటెండ్ కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా కేసీఆర్ ఇంటికి వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చారు. కానీ మాజీ సీఎం హాజరవుతారా.. లేక అటెండ్ కాకుండా ఏమైనా మేసేజ్ చేస్తారా ? అనేది ఉత్కంఠగా మారింది.

మాయమవుతున్న కేసీఆర్ మార్క్

సెక్రటేరియట్‌కు భూమిపూజ చేసినప్పటి నుంచి ప్రారంభోత్సవం వరకు ప్రతి పనీ కేసీఆర్ పర్యవేక్షణలోనే జరిగింది. ఆయన తన కలల సౌధం నిర్మించుకున్నారనే టాక్ అప్పట్లోనే వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చిన తర్వాత సెక్రటేరియట్ ఎన్నో మార్పులు చేసింది. సచివాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో రాజీవ్‌ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో కేసీఆర్ ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లోపల ఏర్పాటు చేస్తున్నారు. బాహుబలి దర్వాజకు ఎదురుగా ఉన్న గేట్‌ను మూసేసి ఈశన్యంలో ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు కేసీఆర్ డిజైన్ చేసిన తెలంగాణ తల్లి విగ్రహం నమూనాను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం మార్చేసింది. ఇన్ని రకాలుగా తన ముద్రలను చెరిపేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోగ్రామ్‌కు కేసీఆర్ హాజరు కష్టమేననే అభిప్రాయం గులాబీ పార్టీలో ఉన్నది. ఒకవేళ ప్రోగ్రామ్‌కు అటెంట్ అయినా అక్కడ జరిగే సన్నివేశాలను చూసి ఆయన తట్టుకోలేరనే చర్చ సైతం జరుగుతున్నది. గతంలో కంటే భిన్నంగా తాము ప్రతిపక్ష నేతకు ఇన్విటేషన్ ఇచ్చి ఆ హోదాను గౌరవించామని కాంగ్రెస్ లీడర్లు పైకి చెబుతున్నా.. ఇంటర్నల్‌గా మాత్రం ఇన్విటేషన్ ఇచ్చి మాజీ సీఎంను ఇరుకున పెట్టామని అంటున్నారు.

Next Story