TG: గుడ్ న్యూస్.. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

by Prasad Jukanti |   (  Updated:2026-05-02 12:23:19  IST  )

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 4 వరకు పొడిగించారు. రూ. 3,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు తెలిపింది.

TG: గుడ్ న్యూస్.. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్‌ (Telangana Intermediate) అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Exams 2026) ఫీజు చెల్లింపు గడువు విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక అప్‍‍డేట్ ఇచ్చింది. సప్లిమెంటరీ ఫీజు గడువును మే4వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. తాజా ప్రకటన ప్రకారం ఆలస్య రుసుము రూ. 3000 చెల్లించి విద్యార్థులు మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఫస్ట్, సెకండ్ ఇయర్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు జరగనున్నాయి. థియరీ పరీక్షల అనంతరం మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.



70 శాంత ఉత్తీర్ణత:

కాగా, ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను గత నెల 12వ తేదీన ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షల్లో 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 75.34 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరం విద్యార్థుల్లో 66.20 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,89,123 మంది విద్యార్థులు హాజరుకాగా, సెకండ్ ఇయర్ పరీక్షలకు 4,53,932 మంది హాజరయ్యారు.


Next Story