- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల
ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి రెండు సెషన్లలో నిర్వహించనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి విద్యార్థులు నేటి నుంచి ఈనెల 30 వరకు ఫీజు చెల్లించేలా ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 23 నుంచి 30 వరకు రీకౌంటింగ్‌కు రూ.100, రీ వెరిఫికేషన్ కోసం రూ.600 ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 3 నుంచి 6 వ తేదీ వరకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు తమ కాలేజ్ లాగిన్ నుంచి షాట్ మెమో డౌన్లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఏమైనా సందేహాలుంటే helpdesk-ie-telangana.gov.in వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించింది.
టోల్ ఫ్రీ నంబర్ :
పరీక్షల్లో ఫెయిలైన లేదా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యే వాళ్లకి 14416 నంబర్ కి కాల్ కౌన్సెలింగ్ తీసుకునేలా ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది.






