- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana: ఇంటర్ ఎగ్జామ్స్ అప్‌డేట్
ఇంటర్ పరీక్ష(Inter Exams)లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) సమీక్షా సమావేశం నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ పరీక్ష(Inter Exams)లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎస్ శాంతికుమారి(CS Shanti Kumari) సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో ఇంటర్ బోర్డు(Telangana Inter Board) అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టాలని చెప్పారు. కాగా, తెలంగాణలో మార్చి 5 నుంచి జరగనున్న ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. క్వశ్చన్ పేపర్లను ఆయా స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి పోలీస్ స్టేషన్‌లోకి తరలించే ముందు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
రిసెప్షన్ సెంటర్లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు ఉండాలని.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని సీఎస్ శాంతి కుమారి అధికారులతో అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ని విధించాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు గాని పరీక్షా సిబ్బంది గానీ ఎటువంటి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్లను లోపలికి అనుమతించకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎస్(CS Shanti Kumari) సూచించారు. సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9, 96,971 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.






