- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 96.90 శాతం హాజరు
తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షల్లో తొలిరోజు 96.90 శాతం హాజరు నమోదైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-I పరీక్ష నిర్వహించారు. మొదటి రోజు పరీక్షల్లో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని బోర్డు స్పష్టం చేసింది. తొలి రోజు పరీక్షకు సంబంధించి 96.90 శాతం హాజరు నమోదైనట్లుగా ఇంటర్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,98,695 హాజరయ్యారయ్యారని, 15,903 మంది గైర్హాజరైనట్లుగా తెలిపింది.
రాష్ట్రంలోని మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, సూర్యాపేట, నల్గొండ, నిజామాబాద్ సహా పలు జిల్లాలకు బోర్డు నుంచి ప్రత్యేక అబ్జర్వర్లను పంపించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు అత్యంత ప్రశాంతంగా, సజావుగా సాగినట్లు తెలిపారు. బుధవారం జరిగిన పరీక్షలో ప్రశ్నపత్రం సెట్-బి వినియోగించినట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణ పట్ల ఇంటర్ బోర్డు కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు మరింత సమాచారం కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్ tgbie.cgg.gov.in ను సందర్శించవచ్చని తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి క్రుష్ణ ఆదిత్య బుధవారం సికింద్రాబాద్, మారేడుపల్లి ప్రాంతాలలోని పలు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను సమీక్షించారు.






