- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ జనరల్, ఓకేషనల్ కోర్సుల్లో ఫస్టియర్ ప్రవేశాల తేదీలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి(టీజీబీఐఈ) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ తదితర జూనియర్ కాలేజీలకు సంబంధించి మే 1 నుంచి 31 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన విద్యార్థులు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. జూన్ 2 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొంది. దరఖాస్తు విద్యార్థుల పదోతరగతి గ్రేడు, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయించనున్నారు. తెలిపింది. ప్రిన్సిపాల్స్ ఇంటర్నెట్ మార్కుల మెమోల ఆధారంగా ప్రొవిజనల్ అడ్మిషన్లు చేయవచ్చునని, అయితే ఒరిజినల్ ఎస్ఎస్సి పాస్ సర్టిఫికేట్, చివరిగా చదివిన పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ సమర్పించిన తర్వాతే ఈ ప్రొవిజనల్ అడ్మిషన్లు ఖరారు ఉంటుందని పేర్కొంది. ప్రవేశాలలో రిజర్వేషన్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని ప్రిన్సిపాల్స్‌కు ఇంటర్ బోర్డు సూచించింది.
పారదర్శకత పాటించాలి:
అడ్మిషన్ కోసం ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని, ఇతర విధానాల ద్వారా అడ్మిషన్లు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ప్రైవేట్ ఎయిడెడ్, అన్ ఎయిడెడ్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, కెజిబివి, బిసి వెల్ఫేర్, మైనారిటీ, మోడల్ స్కూల్ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ కోర్సులో ప్రవేశం కోరుకునే విద్యార్థులు ఆధార్ నంబర్ తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది, అన్ ఎయిడెడ్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ మంజూరైన సెక్షన్ల వరకే, ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థుల సీలింగ్ స్ట్రెంగ్త్ వరకే అడ్మిషన్లు జరపాలని, మండలి తొలగించిన కాంబినేషన్లలో అడ్మిషన్లు చేయకూడదని ఆదేశించారు. అదనపు సెక్షన్లలో అడ్మిషన్లు బోర్డు అనుమతి తర్వాత మాత్రమే జరపాలని, ఉల్లంఘిస్తే జరిమానా విధించడంతో పాటు కళాశాల అనుబంధ గుర్తింపు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటామని పేర్కొంది
ప్రవేశాల షెడ్యూల్:
మొదటి దశ ప్రవేశాల ప్రారంభం: 01-05-2025
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 31-05-2025
తరగతులు ప్రారంభం: 02-06-2025
మొదటి దశ ప్రవేశాల ముగింపు: 30-06-2025
- Tags
- inter board






