హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర.. చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ప్లాన్?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-21 08:40:56  IST  )

హైదరాబాద్ లో భారీ పేలుళ్లకు ఉగ్రమూకలు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచారు.

హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర.. చంచల్‌గూడ జైలు ములాఖత్‌లో ప్లాన్?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీచౌక్ సమీపంలో ఉన్న ఆలయాల్లో బ్లాస్టింగ్స్ కు లష్కరేతోయిబా ప్లాన్ చేసినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించాయి. తాజాగా హైదరాబాద్ లోనూ ఉగ్రమూకలు పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. చంచల్ గూడ జైల్లో ఇటీవల నిర్వహించిన ములాఖత్ లో పేలుళ్లకు ప్లాన్ రచించినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ఉగ్రవాది జైల్లో ప్రణాళికలు రచించినట్లుగా నిఘావర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ముసారాంబాగ్, సైదాబాద్, మలక్ పేటలో పోలీసులు నిఘా పెంచారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోనున్నారు. ప్రజలు కూడా ఎవరైనా అనుమానాస్పదంగా తిరగడాన్ని గమనిస్తే సమాచారమివ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Next Story