సంక్షేమ శాఖలలో హాస్టల్ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్

by Naga Rani Yarlagadda |

తెలంగాణలోని అన్ని సంక్షేమ శాఖలలో హాస్టల్ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ను రూపొందించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ నిర్ణయించింది.

సంక్షేమ శాఖలలో హాస్టల్ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్
X
  • అధికారులతో సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని అన్ని సంక్షేమ శాఖలలో హాస్టల్ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ను రూపొందించుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ నిర్ణయించింది. అన్ని సంక్షేమ శాఖలలో హాస్టల్ నిర్వహణ కోసం ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ను రూపొందించడంపైన మంగళవారం జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ అధ్యక్షతన షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ, బీసీ సంక్షేమం, మైనారిటీల సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శిత కలిసి ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా విద్యార్థులు, రెసిడెన్షియల్​విద్యార్థల సంక్షేమం, హాస్టల్ సౌకర్యాలు, ఆహార సరఫరా, వైద్య అత్యవసర పరిస్థితులు, తనిఖీలు మరియు నివేదికలు వంటి ముఖ్యమైన విధులకు సాఫ్ట్‌వేర్ ప్రాధాన్యత ఇవ్వాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల నిర్వహణ, పర్యవేక్షణను మెరుగుపరచడమే కాకుండా మెరుగైన మరింత ప్రభావవంతమైన పర్యవేక్షణ ఉండాలని, వివరణాత్మక కార్యాచరణ నివేదికలను అందించే అప్లికేషన్‌ను రూపొందించాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు చర్చించారు. చర్చల సందర్భంగా, వివిధ విభాగాల హాస్టల్ నిర్వహణలో ఉమ్మడిగా ఉండే కీలక రంగాలను గుర్తించారు. సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అమలు చేస్తూ ముందుకు వెళ్లే అంశాలను సంబంధిత వర్గాలు వారికి వివరించారు. అనుసరించాల్సిన కార్యాచరణ, శాస్త్ర సాంకేతికతను వినియోగించడంపైన అధికారులు సాఫ్ట్​వేర్​నిపుణులకు అనేక సూచనలను ఇచ్చారు.

Next Story